కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఈటల

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణగా మారనున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మే 7న నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన కన్నెపల్లి (లక్ష్మీ) 3వ పంప్‌హైజ్‌ను మంత్రి సందర్శించారు.

హైదరాబాద్‌ నుంచి కన్నెపల్లికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో మంత్రి వెళ్లారు. ఆగస్టు వరకు కన్నెపల్లి పంప్ హౌస్ 3వ టీఎంసీ పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లు, మెగా కంపెనీ అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు.

SOURCE:  నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *