కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిళ్లు, చావులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పెళ్లి వేడుకలకు 50 మంది, అంత్యక్రియల వద్ద 20 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో జనం ఉండరాదని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవా తెలిపారు.
ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నట్లు ఆఫీసుల్లో సోషల్ డిస్టాన్సింగ్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫేస్ మాస్క్లు, శానిటైజర్లు ఆయా ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులంతా ఆరోగ్య సేతు యాప్లో రిజిస్టర్ చేసుకోవాలని శ్రీవాస్తవా తెలిపారు.
SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ