దశాబ్దాల తర్వాత ఆ గ్రామ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని చుశారు

కాలుష్యం కారణంగా కానరాకుండా పోయిన హిమనగ శిఖరం ఎవరెస్ట్ కనిపించేసరికి సింఘవాహిని గ్రామ ప్రజలు పరవశులైపోయారు. దశాబ్దాల తర్వాత మళ్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని చూడగులుగుతున్నామన్నారు. గ్రామ సర్పంచ్ రితూ జైస్వాల్ ఆ దృశ్యాన్ని బంధించి ట్విట్టర్ లో పెట్టారు.

నిజానికి బీహార్‌లోని సీతామడీ జిల్లాలోని ఆ గ్రామానికి ఎవరెస్ట్ శిఖరం వందల కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో ఉంటుంది. తలపండిన పెద్దలు ఎప్పుడో ఆ శిఖరాన్ని చూసి ఉంటారు. కానీ కాలుష్యం పుణ్యమా అని నేటి తరానికి ఆ సౌలభ్యం లేకుండా పోయింది. సర్పంచ్ రితూ కూడా ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ‘మా ఊరిలోని ఇళ్ల పైకప్పుల మీద నిల్చుంటే ఎవరెస్ట్ కనిపిస్తుంది’ అంటూ ఆమె సగర్వంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *