తన చిన్నారికి వింత పేరు పెట్టిన ఎలాన్ మస్క్

టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తనకు కొడుకు పుట్టాడని ప్రకటించాడు. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు.

ఓ నెటిజెన్ ‘‘మీ చిన్నారికి ఏం పెరు పెట్టారో తెలుసుకోవాల్సిన అవసరం మాకెంతైనా ఉంది’’ అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ ‘‘ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్’’ అని సమాధానం చెప్పాడు. అయితే దీనిని నాస్చా 12 తో ఉచ్చరించవచ్చని సలహా ఇచ్చారు. నాస్చా అనేది గ్రీకుకు చెందిన పదం. నాస్చా అంటే యోధుడు, రక్షకుడు అనే అర్థాలు వస్తాయి. అంతే కాకుండా విశ్వవిజేత అలెగ్జాండర్‌ను కూడా నాస్చాగా సంబోధిస్తారని కొందరు ప్రస్తావించారు.

SOURCE: ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *