కొవిడ్-19 పోరాటంపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గీతం విడుదల

HumHaarNahiMaanenge (మేము ఓటమిని అంగీకరించం) పేరుతో ప్రజలందరిలో సకారాత్మక భావనలను ప్రేరేపించే గీతాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విడుదల చేసింది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒక్కతాటి పైకి వచ్చి, దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించేలా ఈ గీతాన్ని రూపొందించారు.

ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ స్వరకల్పన చేయగా, ప్రముఖ గీత రచయిత, కవి ప్రసూన్ జోషి సాహిత్యాన్ని సమకూర్చారు. భారతదేశం నలుమూలల నుంచి సంగీత కళాకారులను ఒక్క చోటుకు తీసుకు వచ్చింది. ఈ విశిష్ట కళాకారుల్లో క్లింటన్ సెరెజో, మోహిత్ చౌహాన్, హర్ష్‌దీప్ కౌర్, మికా సింగ్, జోనితా గాంధీ, నీతి మోహన్, జావేద్ అలీ, సిద్ శ్రీరామ్, శ్రుతి హాసన్, సాషా తిరుపతి, ఖతిజా రెహమాన్ మరియు అభయ్ జోధ్‌పూర్కర్ తదితరులు ఉన్నారు.

భారతదేశపు ప్రధాన పెర్క్యూసినిస్ట్ శివమణి, సితారిస్ట్ అసద్ ఖాన్ ,బాస్ ప్రోడిజీ మోహిని డే కూడా ఈ కీలక ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఆశావాదం, సకారాత్మక భావనలు, స్ఫూర్తిని ప్రేరేపించేలా ఈ పాటను తీర్చదిద్దారు. శక్తివంతమైన, భావోద్వేగమైన పాటను ఆలకించినప్పుడు మనమంతా కలిసి కట్టుగా ఉన్నామని, కలిసే ఉండాలన్న భావనను ప్రజలకు కలిగిస్తుంది.

SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *