ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇండియన్‌ నేవీ సముద్ర సేతు ఆపరేషన్‌ను చేపట్టింది. మాల్దీవులు, యూఏఈ దేశాల్లో  చిక్కుకున్న భార‌తీయులను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు మూడు నౌక‌ల‌ను పంపించారు. కోవిడ్19 నేప‌థ్యంలో ఆయా దేశాల్లో నిలిచిపోయిన‌వారిని తీసుకురానున్న‌ట్లు ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి తెలిపారు.

ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు
ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు

ముంబై తీరం నుంచి ఐఎన్ఎస్ జ‌లాష్వాతో పాటు ఐఎన్ఎస్ మ‌గ‌ర్ నౌక‌ల‌ను మాల్దీవుల‌కు పంపిస్తున్నారు. మే 4న రాత్రి ఆ నౌక‌లు బ‌య‌లుదేరి వెళ్లాయి. ఇక ఐఎన్ఎస్ శార్దూల్‌ను దుబాయ్‌కు పంపిస్తున్నారు.  అక్క‌డ ఉన్న భార‌తీయుల‌ను ఆ నౌక‌లో తీసుకురానున్నారు.  అయితే ఈ నౌక‌లు తిరిగి కొచ్చి తీరానికి వ‌స్తాయ‌ని ర‌క్ష‌ణ‌శాక ప్ర‌తినిధి స్ప‌ష్టం చేశారు. యుద్ధ‌నౌక‌లు ఐఎన్ఎస్ మ‌గ‌ర్‌, ఐఎన్ఎస్ శార్దూల్‌లు.. స‌ద‌ర‌న్ నావెల్ క‌మాండ్‌కు చెందిన నౌక‌లు కాగా,  ఐఎన్ఎస్ జ‌ల‌ష్వా ఈస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌కు చెందిన‌ది.

SOURCE: పీఐబీ, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *