లాంగ్ మార్చ్-5బీ రాకెట్ను ప్రయోగించిన చైనా

వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకుంటున్న చైనా మ‌రో ముంద‌డుగు వేసింది. అత్యంత శ‌క్తివంత‌మైన లాంగ్ మార్చ్‌-5బీ రాకెట్‌ను ఇవాళ డ్రాగ‌న్ దేశం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది.  వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి ఈ భారీ రాకెట్‌ను ప్ర‌యోగించారు.

భూక‌క్ష్య‌లోకి ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టారు. స్పేస్ స్టేష‌న్ నిర్మించాల‌నుకుంటున్న చైనా హెవీ రాకెట్ల‌ను ప‌రీక్షిస్తున్న‌ది.  ఎల్ఎం5 సిరీస్‌లో ఇది నాలుగ‌వ వేరియంట్. మాన‌వ స‌హిత వ్యోమ యాత్ర‌ల‌ను చేప‌ట్టే విధంగా 5బీ రాకెట్ నిర్మాణాన్ని చేప‌ట్టారు.  లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సుమారు 53.7 మీట‌ర్ల పొడువు ఉన్న‌ది. ఆ రాకెట్‌లో మొత్తం 10 మెయిన్ ఇంజిన్లు ఉన్నాయి.

SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *