నాజీ జర్మనీపై విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తియను సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ఉన్కు రెండో ప్రపంచయుద్ధ స్మారక పతకాన్ని ప్రదానం చేశారు. ఉత్తర కొరియా భూభాగంపై అమరులైన సోవియట్ సైనికుల స్మృతిని సజీవంగా ఉంచుతున్నందుకు గుర్తింపుగా ఆ పతకాన్ని ఇస్తున్నట్టు రష్యా ప్రకటించింది.
సీయోల్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా రాయబారి అలెగ్జాండర్ మాత్సెగోరా చేతుల మీదుగా ఉత్తరకొరియా విదేశాంగమంత్రి రీ సోన్-గోన్ ఆ పతకాన్ని అందుకున్నారు.
SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ