కొలంబియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జిన్నెత్ బెడోయా లిమాకు ఈ యేటి యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ దక్కింది. లాటిన్ దేశం కొలంబియాలో జరుగుతున్న సాయుధ పోరాటం గురించి ఆమె అనేక కథనాలు రాశారు. అక్కడ మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు.
ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్స్ చేసిన ప్రతిపాదన మేరకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. కొలంబియాలోని ఎల్ ఎస్స్పెక్టడారో అనే పత్రికకు ఆమె పనిచేశారు. 2000 సంవత్సరంలో ఆయుధాల స్మగ్లింగ్‌కు సంబంధించి ఓ ఇన్వెస్టిగేటివ్ కథనం రాసిందామె. అప్పుడు ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఆ తర్వాత మరో మూడేళ్లకు ఎల్ టింపో అనే దినపత్రికలోనూ పనిచేసినప్పుడు కొలంబియాకు చెందిన సాయుధ దళాలు ఆమెను కిడ్నాప్ చేశాయి. ఓ మహిళగా, జర్నలిస్టుగా జినెత్ బెడోయా లిమా చూపిన తెగువను గాఢంగా గౌరవిస్తున్నట్లు యునెస్కో డైరక్టర్ జనరల్ ఆడ్రే ఆజైలే తెలిపారు. ప్రైజ్ కింద 25 వేల డాలర్లు ఇస్తారు.
SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ