ఏపీలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరట

కనీస విద్యుత్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు

లాక్‌డౌన్‌ ప్రభావంతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. లాక్‌డౌన్‌ అనంతరం పరిశ్రమల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలకు వర్కింగ్‌ కేపిటల్‌ రూపంలో రూ.200 కోట్ల మేర అందించాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన కనీస విద్యుత్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 2014-19 వరకు ఉన్న రూ.905 కోట్ల పారిశ్రామిక రాయితీ బకాయిల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

SOURCE:  సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *