ఈ ఏడాది పులిట్జర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది?

అమెరికాకు చెందిన న‌ల్ల‌జాతి ర‌చ‌యిత కోల్స‌న్ వైట్‌హెడ్‌కు ఈ ఏడాది పులిట్జ‌ర్ ప్రైజ్ ద‌క్కింది.  పులిట్జ‌ర్ అవార్డును రెండ‌వ సారి గెలుచుకున్న నాలుగో ర‌చ‌యిత కోల్స‌న్. ఆఫ్రికా-అమెరికా మూలాలు క‌లిగిన కోల్స‌న్ రాసిన ద నికిల్ బాయ్స్ అన్న ర‌చ‌న‌కు అవార్డు ద‌క్కింది.

ఫ్లోరిడాలో ఉన్న జువెనైల్ స్కూల్‌లో న‌ల్ల‌జాతి పిల్ల‌లు ఎదుర్కొన్న వివ‌క్ష గురించి ఆ పుస్త‌కంలో రాశారు. న్యూయార్క్‌కు చెందిన 50 ఏళ్ల వైట్‌హెడ్‌. 2017లోనూ పులిట్జ‌ర్ బ‌హుమ‌తిని గెలుచుకున్నారు. అండ‌ర్‌గ్రౌండ్ రెయిల్‌రోడ్ అన్న పుస్త‌కానికి అప్పుడు అవార్డు ద‌క్కింది. కోల్స‌న్ క‌న్నా ముందు పులిట్జ‌ర్ బ‌హుమ‌తిని రెండుసార్లు గెలుచుకున్న‌వారిలో బుక్ టార్కింగ్ట‌న్‌, విలియ‌మ్ ఫాల్క‌న‌ర్‌, జాన్ ఉప్‌డికేలు ఉన్నారు.

SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *