ఒక్కపూటలో రూ. 1,299 కోట్ల పింఛను పంపిణీ

లాక్‌డౌన్, కరోనా విపత్కర పరిస్థితిల్లోనూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర పింఛనుదారుల చేతికి ఒక్కపూటలోనే ప్రభుత్వం రూ. 1299.14 కోట్లు అందజేసింది. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రతినెలా ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సామాజిక పింఛనుదారులకు పెన్షన్‌ డబ్బులు అందజేయాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి వారి కళ్లలో ఆనందాన్ని నింపింది. వలంటీర్లు మే 2న లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్‌ డబ్బులను అందచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 58,22,399 మంది పింఛనుదారులకుగాను 54,53,408 మందికి ఒకటవ తేదీనే పెన్షన్‌ డబ్బులు పంపిణీ చేశారు. తొలిరోజు 93.66 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 19,960 మంది పెన్షన్‌దారులు పోర్టబులిటీ విధానంలో ప్రస్తుతం వారున్నచోటే పెన్షన్‌ డబ్బులు అందుకున్నారు. 

ఎర్రావారిపాళెం ప్రథమ స్థానం

పింఛన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ప్రథమ స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం 12 గంటలకే 99.52 శాతం పంపిణీ పూర్తయింది. గ్రామంలో 4,587 మంది లబ్ధిదారులు ఉండగా 4,563 మందికి పంపిణీ చేశారు. 17 మంది మృతి చెందడంతో పింఛన్లు ఇవ్వలేదు. మరో ఏడుగురు అందుబాటులో లేరు. సమన్వయంతో పంపిణీ చేపట్టిన ఎంపీడీఓ మురళీమోహన్‌రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు.

SOURCE:  సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *