మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి తాజాగా మరో శాఖ
ఏపీలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా మరో శాఖను అప్పగించారు.
పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను మంత్రి గౌతమ్‌రెడ్డికి కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
SOURCE: సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి