కేంద్రం తాజా మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేసులు ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసు నమోదైతే.. గ్రామీణ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర, పట్టణ, నగర ప్రాంతంలో అయితే 5 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్/క్లస్టర్‌గా గుర్తించారు. ఇలాంటి క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 238 ఉన్నాయి. వీటిలోనే రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. ఇవి మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతమంతా గ్రీన్ జోన్ కిందికే వస్తుంది. ఈ 238 క్లస్టర్లలో కూడా ఆరెంజ్ జోన్లు అధికంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రెడ్ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్లో, ఒకటి గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
SOURCE: ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి