ఎంపీ సీఎం రమేశ్‌కు ఢిల్లీలో కీలక బాధ్యతలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుడిగా రాజ్యసభ తరఫున సీఎం రమేశ్‌ను తీసుకున్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కమిటీలో రమేశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలోనే రమేశ్ సభ్యుడిగా ఉంటారు. పీఏసీ అంటే ప్రభుత్వం చేసే ఖర్చులను పరిశీలించే కమిటీ అని అర్థం.

రెండ్రోజుల క్రితమే వైసీపీ ఎంపీ బాలశౌరిని లోక్‌సభ తరఫున సభ్యుడిగా తీసుకోవడం జరిగింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైసీపీకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు గనుక బాలశౌరికి చోటు దక్కింది.

లోక్‌సభ నుంచి మొత్తం 15 మందిని, రాజ్యసభ నుంచి ఏడు మందిని ఈ కమిటీలో సభ్యులుగా తీసుకున్నారు. ఈ మేరకు మొత్తం 22 మందిని తీసుకున్న కేంద్రం ఇంకా ఇద్దరు రాజ్యసభ నుంచి ఇద్దర్ని తీసుకోవాల్సి ఉంది. ఆ ఇద్దరి పేర్లను కేంద్రం ఇంకా పెండింగ్‌లో పెట్టింది.

SOURCE: ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *